naa-nuvva-movie-promotionsకష్టపడి ఓ సినిమాను తీయడం ఎంత ముఖ్యమో, ప్రస్తుతం దానిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. దీంతో ప్రమోషన్స్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమదైన శైలిలో చిత్రాలను ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. ఈ కోవలో కళ్యాణ్ రామ్ – తమన్నాలు జంటగా తెరకెక్కిన “నా నువ్వే” చిత్ర యూనిట్ వినూత్నమైన రీతిలో పబ్లిసిటీకి తెరలేపింది.

హైదరాబాద్ సిటీలో నిత్యం తిరిగే క్యాబ్ లతో ఈ ప్రమోషన్స్ ను చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు లైటింగ్ తో కూడిన బోర్డులను క్యాబ్ లకు అమర్చి పబ్లిసిటీ నిర్వహిస్తున్నారు. దాదాపుగా 400 క్యాబ్ లకు ఈ హోర్డింగ్స్ అమర్చడంతో, సిటీలో సాయంత్రం అయ్యే సమయానికి “నా నువ్వే” క్యాబ్ లు దర్శనమిస్తున్నాయి. ప్రమోషన్ కొత్తగా ఉండడంతో చూపరులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది.