N-raghuveera-reddyనిన్నటి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెట్లర్లు ఎక్కువగా ఉండే శేరిలింగంపల్లిలో భారీ బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. విభజన సమయంలో సోనియా,రాహుల్ గాంధీలు రెండు రాస్ట్రాలు తలమానికంగా ఉండడానికి వీలుగా చట్టాలు చేశారని, పార్లమెంటులో హామీలు ఇచ్చారని ఆయన అన్నారు.

చాలా మంది ఆంద్రులు ఇక్కడ ఉన్నారని , ప్రతి తెలుగువాడు మనకు మోసం చేసిన మోడీని ఓడించాలని కోరామని, అలాగే బిజెపిని మట్టి కరిపించారని అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ మాట మార్చారని ఇక్కడవారు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు హస్తం గుర్తు ఒకటే శరణ్యమని ఆయన అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకు న్యాయం జరగాలంటే రాహుల్ ను ప్రధానమంత్రిని చేయాలని రఘువీరా కోరారు. ఇవన్నీ బానే ఉన్నాయిగానీ ఆంధ్రలో పార్టీకు డిపాజిట్లు కూడా తెచ్చిపెట్టలేని రఘువీరా తెలంగాణాలో ఓట్లు రాలుస్తారని కాంగ్రెస్ వారు ఎలా అనుకున్నారో? ఆయన పోటీ చేసిన పెనుకొండలో పట్టుమని 20 వేల ఓట్లు కూడా తెచుకోలేకపోయారు.