N. M. D. Farooq - Kidari Sravan Kumar into TDP Cabinetఎన్నికలకు ఆరు నెలల లోపే ఉండగా ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఉండవల్లిలోని సీఎం నివాసం ప్రజావేదికలో గవర్నర్‌ నరసింహన్‌ త్త మంత్రులుగా కిడారి శ్రావణ్‌కుమార్‌, ఎన్‌.ఎమ్‌.డి. ఫరూక్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఫరూక్‌కు మైనారిటీ సంక్షేమంతోపాటు ముఖ్యమంత్రి వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కేటాయించే అవకాశం ఉంది.

గిరిజన సంక్షేమశాఖను శ్రావణ్‌కు అప్పగించనున్నట్లు సమాచారం. కిడారి శ్రావణ్‌కుమార్‌ ఇరు చట్టసభల్లో సభ్యుడు కాకుండానే నేరుగా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 1995లో నందమూరి హరికృష్ణ తర్వాత ఇలా అవకాశం లభించింది ఈయనకే. మాములుగా అయితే ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రివర్గంలో చేరితే ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకి ఎన్నిక కావాల్సి ఉంటుంది.

సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండటంతో అరకు స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం లేకపోయింది. అదే సమయంలో శాసనమండలి స్థానమూ ఖాళీగా లేదు. దీంతో… చట్టసభల్లో సభ్యుడు కాకున్నా శ్రావణ్ ఆరు నెలల పాటు మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది . ఈలోగానే సాధారణ ఎన్నికలు వస్తాయి గనుక అరకు నుంచి శ్రావణ్‌నే పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపనున్నారు.