Mythri Movie Makers next with nani and Director Vikramయువ హీరో నాని మంచి హిట్ లో ఉన్నాడు. అయితే ఈ కుర్ర హీరోతో సినిమా తీస్తే మినిమమ్ గ్యారంటీ హిట్ అన్న సంగతి తెలిసిందే. ఇక బడ్జెట్ విషయంలో కూడా భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఇదిలా ఉంటే మరో పక్క వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాని, ఒక పక్క జెర్సీ తో సందడి చెయ్యడానికి సిద్దం అవుతూనే, మరో పక్క మైత్రీతో 24సినిమా దర్శకుడు విక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చెయ్యనున్నాడు. ఇక ఆ సినిమాని మైత్రీ మూవీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇక మరో పక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో నాని లాంటి యువ హీరోల సినిమాలు ఎలా తీసినా, రైట్స్, వసూళ్లు అన్నీ కలసి ఒక యాబై కోట్ల వరకూ వసూళ్లు చెయ్యవచ్చు. అయితే ఈ క్రమంలోనే నాని సినిమాకి పారితోషకం తీసుకోకుండా సినిమా లాభాల్లో యాబై శాతం అడుగుతున్నాడట. అంటే ఉదాహరణకి సినిమా ఒక 20 కోట్లు అయ్యింది అనుకోండీ, అందులో నాని పారితోషకం ఎలాగో ఉండదు కనుక, ఇదే సినిమా 40 నుంచి 50 కోట్లు చేసినా పెట్టిన 20 కోట్లు బడ్జెట్ తీసేసి, మిగిలిన 20-30 కోట్ల లాభాల్లో 50-50 అంటే…నానికి 10 నుంచి 15 కోట్ల పారితోషకం వస్తుందన్న మాట.

అయితే ఈ పద్దతిలో నిర్మాతకు ఉన్న లాభం ఏంటి అంటే ఒకవేళ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా హీరో రెమ్యునిరేషన్ విషయంలో పెద్దగా ఇబ్బంది పడవలసిన పని ఉండదు. మరో పక్క నాని లాంటి హీరోకి కూడా 10 నుంచి 15 కోట్ల రెమ్యునిరేషన్ డైరెక్ట్ గా అడిగితే ఎంత డిమ్యాండ్ ఉన్నా చిన్న నిర్మాతలు ఆలోచిస్తారు కనుక, ఈ పద్దతిలో కాస్త ఎక్కువగానే రాబట్టుకోవచ్చు అని చెప్పవచ్చు. ఐడియా బానే ఉంది…మరి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.