Music Director Thamanసంగీత దర్శకుడు థమన్ ప్రస్తుతం తన అల వైకుంఠపురంలో ఆడియో విజయవంతం అయిన తరువాత అనూహ్యమైన ఫామ్ లో ఉన్నాడు. దానితో ఆయన భవిష్యత్ ప్రాజెక్టులపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సంగీత దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో అతని అభ్యుదయ ఆశయాన్ని వెల్లడించాడు.

“నాకు 50 ఏళ్లు వచ్చేసరికి, పిల్లలు సంగీత వాయిద్యాలు మరియు గాత్రాలను నేర్చుకునే సంగీత పాఠశాలను ఏర్పాటు చెయ్యలనుకుంటున్నాను. సంగీతం నేర్చుకోవడంలో అపారమైన అభిరుచి ఉన్న పేద పిల్లలకు ఈ పాఠశాలలో ఉచిత ప్రవేశం ఉండేలా చూస్తాను” అని ఆయన వెల్లడించారు.

థమన్‌కు ప్రస్తుతం 36 సంవత్సరాలు, అందువల్ల, కలను సాకారం చేసుకోవడానికి అతనికి 14 సంవత్సరాలు సమయం ఉంది. థమన్ ఖాతాలో ప్రస్తుతం… మిస్ ఇండియా, వీ, సోలో బ్రతుకే సో బెటర్, క్రాక్, వకీల్ సాబ్, టక్ జగదీష్ సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నారు. మొట్టమొదటి సారిగా ఆయనకు పవన్ కళ్యాణ్ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది.

వీటిలో టక్ జగదీష్ తప్ప మిగతా సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగానే ఉన్నాయి. వీటితో అల వైకుంఠపురంలో ఫామ్ ని కంటిన్యూ చెయ్యాలని థమన్ అభిమానులతో పాటు సామాన్య సినీ సంగీత అభిమానులు కూడా కోరుకుంటున్నారు.