music director Thaman about ravi teja amar akbar antonyమహేష్ బాబు ‘ఆగడు,’ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ,’ వరుణ్ తేజ్ ‘మిస్టర్’… ఇలా వరుసగా మూడు డిజాస్టర్ సినిమాలతో పూర్తిగా డీలా పడిపోయిన శ్రీనువైట్ల, తన లక్కీ హీరో రవితేజతో ప్రస్తుతం “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాను తీస్తోన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా అద్భుతంగా వస్తోందని సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ కితాబిచ్చారు.

“ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఇప్పుడే చూశానని, సూపర్ హిలేరియస్ గా వచ్చాయని, విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయని, ఆకాశమే హద్దుగా శ్రీను వైట్ల మరోసారి రాక్ చేసారని, సూపర్ ఎనర్జీతో రవితేజ మళ్ళీ సూపర్ బ్యాక్ ఇవ్వబోతున్నారని” చేసిన ట్వీట్ ఈ సినిమాపై అంచనాలను ఏర్పడేలా చేస్తోంది. ఈ సినిమాతో ఇలియానా మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వనుండడం మరో స్పెషాలిటీ.