అనతికాలంలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. ఇప్పటివరకు ఆయన కెరీర్ లో ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. దానితో ఈ చిత్రం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకూ కొరటాల అన్ని సినిమాలకు మ్యూజిక్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ను ఈ సినిమాకు కాదనుకున్నాడు దర్శకుడు. అయితే ఆయన ప్లేస్ లో ఎవరిని తెస్తాడు అనేది ఇంకా అనుమానం గానే ఉంది.
బాలీవుడ్ లో అగ్నీపత్, సైరాత్ వంటి మంచి ఆల్బమ్స్ ఇచ్చిన అజయ్ – అతుల్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్స్ గా తీసుకురావాలి అనుకున్నారు. అయితే వారు డేట్స్ కష్టమని చెబుతున్నారట. జనవరికి గానీ తాము ఖాళీగా కామని వారు చెప్పారట. జనవరికి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైతే ఫిబ్రవరికి గానీ ఒకటి రెండు ట్యూన్స్ రెడీ కావు.
అయితే మొదటి షెడ్యూల్ లోనే చిరంజీవి మీద ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చెయ్యాలని కొరటాల అనుకుంటున్నారట. దీనితో అజయ్ – అతుల్ ఆప్షన్ పక్కన పెట్టి మణి శర్మ, థమన్ లతో చర్చలు జరుగుపుతున్నారట. మణి శర్మ దాదాపుగా ఫైనల్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
ఒకప్పుడు చిరంజీవికి బ్లాక్ బస్టర్ పాటలు ఇచ్చిన మణి ఈ మధ్యనే ఫామ్ లోకి వచ్చారు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తరువాత రామ్ నటిస్తున్న రెడ్, అలాగే వెంకటేష్ అసురన్ రీమేక్ కి కూడా ఆయనే మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. చిరంజీవి సినిమా కూడా ఒకే అయితే ఆయన పూర్వ వైభవం దిశగా వెళ్తున్నట్టే.
Undavalli’s Estimation About Alliances In AP
That Section Of Only NTR Fans Are YCP Coverts?