mahesh-chennai-shootingమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్లు నటిస్తున్న పలు కీలక సన్నివేశాలతో పాటు ఒక పాట కూడా చిత్రీకరించబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శోభి ఈ పాటకు నృత్యాలు సమకూర్చనున్నారు.

ఇదిలా ఉంటే, చెన్నై షెడ్యూల్ లో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా అభిమానులతో ప్రిన్స్ దిగిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సింపుల్ కాస్ట్యూమ్స్ తో ప్రిన్స్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మహేష్ ను కొత్తగా చూస్తారని దర్శకుడు మురుగదాస్ చెప్పినప్పటికీ, మేకోవర్ పరంగా పెద్దగా వ్యత్యాసం కనపడడం లేదు. బహుశా ప్రిన్స్ నటనలో మరో కోణం ప్రతిబింబిస్తారేమో చూడాలి.