murugadoss-mahesh-babu-firstlookశ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన “బ్రహ్మోత్సవం” సినిమాతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్న ప్రిన్స్ అభిమానులకు రానున్న దీపావళి సరికొత్త అనుభూతులను పంచేందుకు సిద్ధమవుతోంది. తమిళులకు ఎంతో సెంటిమెంట్ అయిన దీపావళి పండుగ నాడు మురుగదాస్ – మహేష్ ల సినిమా టైటిల్ రివీల్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ డాషింగ్ టైటిల్ తో పాటు అల్టిమేట్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం.

అలాగే హారిస్ జయరాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కూడిన మోషన్ పిక్చర్ కూడా విడుదల కానుందని తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు అభిమానులకు ఈ దీపావళి సరికొత్త వెలుగులను పంచనుంది. ఈ ఫస్ట్ లుక్ కు సంబంధించిన వార్తలు అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తోంది. ప్రిన్స్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా ప్రిన్స్ దర్శనమివనున్నారన్న సమాచారం ఇప్పటికే తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ.