Municipal and Panchayat Elections Andhra Pradesh  postponed upto August 2020స్థానిక ఎన్నికలు అనుకున్నట్టుగా జరపడానికి విశ్వప్రయత్నాలు చేసింది జగన్ ప్రభుత్వం. అందుకు అడ్డు పడిన అప్పటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఆర్డినెన్సు తెచ్చి మరీ తప్పించింది. అయితే కరోనా భయం ఇప్పట్లో వదిలేలా లేరు. ఆగస్టు నాటికి కూడా ఎన్నికలు జరిగే అవకాశం లేదని అంటున్నారు నిపుణులు.

దీనితో అధికార పార్టీ ఆలోచనలోపడింది. స్థానిక ఎన్నికల గురించి ఇప్పటికే అభ్యర్థులు భారీగా ఖర్చుపెట్టారు. ఎన్నికలు ఆలస్యమైతే మళ్ళీ మొదటి నుండి ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. పైగా ప్రతిపక్ష పార్టీ నిలదొక్కుకోవడానికి సమయం కూడా చిక్కుతుంది.

ఆగష్టు లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో పంచాయితీ భవనాలకు వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ రంగులు మార్చడానికి ప్రభుత్వం మరింత టైం అడిగింది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కరోనా పనులలో బిజీగా ఉందని, రంగులు మార్చడానికి మూడు నెలల సమయం అడిగింది ప్రభుత్వం.

రంగుల వల్ల అధికార పార్టీకి ఏదైనా ప్లస్ అయితే మూడు నెలల టైం ఇస్తే ఆ ప్లస్ కూడా దక్కుతుందని అధికారపక్షం ఆశ. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏదైనా అధికార పక్షానికి ప్లస్ అయ్యిందంటే… అది ఇప్పటివరకూ ఉన్న ఏకగ్రీవాలు రద్దు చెయ్యలేదు ఎన్నికల సంఘం. ఆగస్టు వరకూ అంటే అది కూడా అనుమానమే అంటున్నారు నిపుణులు.