Muncipal Elections are Referendum to ys -jagan-ఆంధ్రప్రదేశ్ లో పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే పలు మున్సిపాల్టీల స్థాయి పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తాజాగా వార్డుల పునర్విభజన చేపట్టింది. వచ్చే నెలాఖరులోగా పురపాలక, నగరపాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చెయ్యడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పటికే 64 పురపాలక సంఘాల్లో వార్డులను పునర్విభజిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల జనాభాను లెక్కించి ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. మరో 21 పురపాలక సంఘాల్లో వార్డుల పునర్విభజనకు ఆదేశాలు వెలువడ్డాయి. ఇటీవలే ఎన్నికలలో 151 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్, ఆ వేడి తగ్గేలోపే ఎన్నికలకు వెళ్లి అత్యధిక సీట్లు గెలుచుకునే ఆలోచన చేస్తుంది.

ఈ ఆరు నెలల కాలంలో జగన్ ప్రభుత్వం అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. వాటి వల్ల చాలా విమర్శలు ఎదురుకుంది. అయితే ఆయా అంశాలు ఎంతమేర ప్రజల మీద ప్రభావం చూపిస్తున్నాయి అనేది ఈ ఎన్నికల ఫలితాల వల్ల తెలియవచ్చు. అయితే స్థానికి ఎన్నికలలో ఎప్పుడూ అధికార పార్టీ కొంత మొగ్గు ఉంటుంది.

అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా ప్రిపరేషన్ లేకుండా ఉన్నాయి. దారుణమైన ఎన్నికల ఫలితాలు చవిచూసిన ఆ పార్టీలు కోలుకోనేలోగానే ఎన్నికలు వచ్చేస్తాయి. దీనితో ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. టీడీపీకి కనీసం క్షేత్ర స్థాయిలో యంత్రాంగమన్నా ఉంది, జనసేన పరిస్థితి మరీ దారుణం.