Mumbai School of Economics & Public Policy on coronavirusభారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 35,042. ఇది ఇలా ఉండగా… 40 రోజుల లాక్ డౌన్ ఈ నెల 3తో పూర్తి అవుతుంది. ఆ తరువాత ఏం జరగబోతుంది అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. రేపు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.

అయితే రోజురోజుకీ పెరుగుతున్న కొవిడ్‌-19 కేసులు మే 21 నాటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఓ అధ్యయనం అంచనా వేసింది. అప్పటి కల్లా కొత్త కేసుల పెరుగుదల పూర్తిగా తగ్గిపోనుందని ‘ముంబయి స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ’ తన అధ్యయనంలో వివరించింది.

ఎండ్ ఈజ్ నియర్ పేరిట ప్రచురించిన ఈ అధ్యయనంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమవనుందని అభిప్రాయపడింది. లాజిస్టిక్ డిస్ట్రిబ్యూషన్ పద్దతి ద్వారా దీన్ని అంచనా వేసినట్లు సమాచారం. వైరస్ తొలుత విజృంభించి.. గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత క్రమంగా తగ్గుతున్నట్లు వివిధ దేశాల్లో పరిస్థితుల్ని అధ్యయనం చేసిన తర్వాత తేలిందన్నారు.

దీని ఆధారంగా.. మన దేశంలో వైరస్ వ్యాప్తి రేటును బట్టి అధ్యయనాన్ని కొనసాగించామని తెలిపారు. వీరి అంచనా ప్రకారం మే 21 నాటికి వైరస్ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో 24,222 కేసులు నమోదుకానున్నాయి. ఇక గుజరాత్ లో మే 7 నాటికి 4,833 కేసులను గుర్తించనున్నట్లు లెక్కగట్టారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 10,498, గుజరాత్ లో 4,395 కేసులు నమోదయ్యాయి.