Mudragada Padmanabhamబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మొన్న ఆ మధ్య తూర్పు గోదావరి జిల్లా వెళ్లి మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ని కలిసి వచ్చారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ముద్రగడ వైఎస్సార్ కాంగ్రెస్ వైపే ఉన్నట్టు చెప్పకనే చెప్పేశారు.

ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం మంచిది కాదని, అదృశ్య శక్తి ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారని ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు బహిరంగ లేఖ రాశారు. అదృశ్య శక్తి ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారని అనడంతోనే ముద్రగడ లైన్ ఏంటో అర్ధం అయిపోయింది.

కాగా… ముద్రగడ కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం లో కొన్ని కాంట్రాక్టులు చేస్తున్నట్టు తూర్పు గోదావరిలో వినిపిస్తుంది. ఆయన అవసరమైనప్పుడు పార్టీలో చేరతారట. కుమారుడికి కలిసొచ్చేలా ముద్రగడ కూడా వ్యవహరిస్తున్నట్టు ఉన్నారు. జగన్ కావాలి అనుకుంటే ఆయనను కూడా పార్టీలోకి చేర్చుకోవడం లేదు.

లేదా తటస్తంగానే ఉంచి అవసరమైనప్పుడు ఇలా వాడుకోవడం వ్యూహం గా కనిపిస్తుంది. అయితే మొన్న ఆ మధ్య ముద్రగడ కాపు రిజర్వేషన్ల పోరాటం నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించేశారు. అయినా ఆ పోరాటం వల్ల వచ్చిన రాజకీయ పలుకుబడిని సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.