Mudragada Padmanabham -asks kapu community not to buy heritage productsకాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చంద్రబాబుతో తన వైరాన్ని బాగా పర్సనల్ గా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు అంటే ఒంటికాలి మీద లేచే ముద్రగడ తాజాగా కాపు జాతికి రాసిన బహిరంగ లేఖలో హెరిటేజ్ కి సంబంధించిన పాలు, పెరుగు, కోవా, పన్నీర్, నెయ్యి వాడటం మానేయాలని పిలుపునిచ్చారు.

శుభకార్యాలకు ఇతర కార్యక్రమాలకు హెరిటేజ్ ఉత్పాదనలు వాడకూడదని పిలుపునిచ్చారు. తద్వారా చంద్రబాబు కుటుంబాన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టొచ్చని అన్నారు. కాపులు వాటిని మానేయడమే కాకా ఇతరులను కూడా మానేయడానికి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అయితే కాపు రేజర్వేషన్ల గురించి రాష్ట్రప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది.

ఇప్పుడు అది కేంద్రం పరిధిలోని అంశం. కేంద్రాన్ని ప్రశ్నించడం మానేసి ముద్రగడ చంద్రబాబునే టార్గెట్ చెయ్యడం రాజకీయం అనాలా మరొకటి అనాలా ఆయనే చెప్పాలి. ఉద్యమాన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత వైరం పెంచుకుంటే అది కాపు జాతికి ఎలా మేలు చేస్తాదో… అన్నట్టు మార్చి 31 తరువాత ప్రకటిస్తా అన్న తదుపరి కార్యాచరణ ఏమైందో?