mudragada padmanabhamచంద్రబాబు నాయుడు హయాంలో కాపు రిజర్వేషన్లు అంటూ హడావిడి చేసిన ముద్రగడ పద్మనాభం ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. తాము ఏమీ చెయ్యలేము అని జగన్ స్పష్టం చేసేసినా చేతులెత్తేసి తనని తాను జగన్ మనిషిగా చెప్పకనే చెప్పేశారు. అధికారం మారగానే ఏదో వంకతో ఉద్యయం కాడె వదిలేశారు.

తనను చాలా మంది విమర్శిస్తున్నారు కాబట్టి ఇక తప్పుకుంటున్నా అని ప్రకటించారు. చాలా రోజులు సైలెంట్ గా ఉన్న ముద్రగడ వ్యవహారం మళ్ళీ తెరమీదకు వచ్చింది. ముద్రగడ పద్మనాభం త్వరలో రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఈ తరుణంలో తన గౌరవానికి భంగం కలిగించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముద్రగడ మీడియా ముందుకు వచ్చి డిమాండ్ చేశారు. మరోవైపు… కాపులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ముద్రగడను బీజేపీలో చేర్చుకోవాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తుంది.

ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి… అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ల విషయం తన పరిధిలో లేని అంశమని… తాను ఏమీ చెయ్యలేను అని తేల్చి చెప్పారు. అయినా కాపులు వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎన్నికలలో బ్రహ్మరథం పట్టడంతో ఈ అంశంపై ఆ సామాజిక వర్గానికే ఇంట్రెస్టు లేదు అనే సంకేతం వెళ్లడంతో ముద్రగడ వంటి వారి వల్ల ఉపయోగం ఉంటుందా అనేది అనుమానం.