Mudragada Padmanabham meets Motkupalli Narasimhuluకాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చంద్రబాబు మీద సైధ్యంతిక పోరు కాస్త వ్యక్తిగత కక్షగా మారినట్టు ఉంది. నిన్న హెరిటేజ్ పదార్ధాలు వాడొద్దు అని పిలుపునిచ్చిన ముద్రగడ, నేడు హైదరాబాద్ వచ్చి ఈ మధ్య చంద్రబాబును బాగా విమర్శిస్తున్న ఐవైఆర్ కృష్ణారావు మరియు మోత్కుపల్లి నరసింహులను కలిశారు.

ఇద్దరి ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని కౌగిలించుకుని మరీ అభినందించారు. అయితే కాపు రేజర్వేషన్ల గురించి రాష్ట్రప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది అని తెలుగుదేశం వారు చెబుతున్నారు. ఇప్పుడు అది కేంద్రం పరిధిలోని అంశం. కేంద్రాన్ని ప్రశ్నించడం మానేసి ముద్రగడ చంద్రబాబునే టార్గెట్ చెయ్యడం రాజకీయం అనాలా మరొకటి అనాలా ఆయనే చెప్పాలి.

ఉద్యమాన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు మీద వ్యతిగత వైరం పెంచుకుంటే అది కాపు జాతికి ఎలా మేలు చేస్తాదో… అన్నట్టు మార్చి 31 తరువాత ప్రకటిస్తా అన్న తదుపరి కార్యాచరణ ఏమైందో? ఇలా అయితే ముద్రగడ తన జాతిలో తన పలుకుబడిని పోగొట్టుకునే ప్రమాదం ఉంది.