Mudragada Padmanabham may say Chandrababu naidu better than jaganవైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కాపు రేజర్వేషన్లపై చేతులు ఎత్తేయడంతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆయన మీద విరుచుకుపడిన విషయం తెలిసిందే. మీకు కాపులు ఎందుకు ఓట్లు వెయ్యాలని ప్రశ్నించారు. ఆ తరువాత జగన్ యూ టర్న్ తీసుకున్న దానిని నమ్మే పరిస్థితి అయితే లేదు.

మరోవైపు కాపు కులానికి చెందిన వాడైనా పవన్ కళ్యాణ్ రేజర్వేషన్ల పై స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే వద్దన బోమని చెబుతూనే కులం పరంగా తాను ఏ నిర్ణయం తీసుకోనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ రేజర్వేషన్ల పై హామీ ఇచ్చిన రాష్ట్రంలోనూ కేంద్రంలోను ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడటం లేదు.

మరోవైపు టీడీపీ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌లో కూడా పంపించింది. కాపు కార్పొరేషన్ పెట్టి, ఆడుకుంటుంది. వైసీపీ నాయకులు రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పడం, పవన్ ఎటూ తెల్చకపోతంతో, ఇప్పటి వరకు, ఈ అంశంలో టీడీపీ మాత్రమే స్పష్టత ఇచ్చింది. ఎంతో కొంత బెటర్ అనిపించుకున్నది టీడీపీ మాత్రమే. అయితే ఒకప్పుడు దుమ్మెత్తి పోసి ఇప్పుడు ముద్రగడ టీడీపీకి సపోర్టు చేస్తారా? లేక మౌనంగా ఉండిపోతారా?