Mudragada Padmanabham - Chandrababu Naiduకాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకా కనిపించడం మానేశారు. అప్పట్లో చంద్రబాబు హయాంలో వారానికి ఒక లేఖ రాసే ఆయన….. కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేం అని చెప్పేసి చంద్రబాబు ఇచ్చిన 5% రిజర్వేషన్ ను కూడా కొట్టేసినా బయటకు రాకుండా ఒక లేఖ రాసేసి ఆ విషయాన్నీ పక్కన పారేశారు.

ముద్రగడ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ లేఖ రాయడం గమనార్హం. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాట దృశ్యాలతో తనపై కేసు రాకుండా అప్పట్లో చంద్రబాబు నాయుడు సిసిటీవీ పుటేజీని మాయం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించి సిసిటివి పుటేజ్ మాయం చేయలేదా అని ప్రశ్నించారు.

అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు చిలక పలుకులు పలుకుతున్నారని, అప్పట్లో ఎస్ ఐ నుంచి డిజిపి వరకు అందరిని వాడుకున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు సానుభూతి కోసం ఆడుతున్న నాటకం అని ఆయన ధ్వజమెత్తారు.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నారని ప్రజలలో బలంగా ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ వారు చంద్రబాబు పై, టీడీపీ వైపు విమర్శల దాడి పెంచారు. ప్రజల దృష్టి మరల్చడానికి అందులో భాగంగానే తమ పెయిడ్ ఆర్టిస్టు ముద్రగడను కూడా రంగంలోకి దించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అందుకే కాపు ఉద్యమాన్ని జగన్ కు తాకట్టు పెట్టారని వారి విమర్శ.