Mudragada Padmanabhamవైఎస్సాఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం బీజేపీలో చేరుతున్నారు అనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ముద్రగడ్డ పద్మనాభంతో, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు భేటీ అయ్యారు. వారి భేటీపై గోదావరి జిల్లాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ, జనసేన పొత్తుపై ఇరువురూ చర్చలు జరిపినట్లు సమాచారం.

కాపు నాయకుడుగా కోస్తాంధ్రాలో పట్టున్న ముద్రగడ పార్టీలోకి వస్తే కోస్తాంధ్రాలో మరింత బలం పేరుగుతుందని బీజేపీ ఆలోచన. కాపు పార్టీగా ఉన్న జనసేనతో పొత్తు ఉండడంతో ముద్రగడ కూడా తమ వైపు వస్తే ఇక ఆ సామజిక వర్గంలో తమకు ఎదురు ఉండదని కమలనాథుల భావనగా కనిపిస్తుంది. దానితో ఆయనను పార్టీలోకి తెచ్చే విధంగా పావులు కదుపుతున్నారు.

ఇది ఇలా ఉండగా ముద్రగడ కాపు ఉద్యమాన్ని దాదాపుగా పక్కన పెట్టినట్టుగానే కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో బలంగా ఉద్యమం నడిపి ఆ తరువాత జగన్ ప్రభుత్వం రాగానే మౌనం దాల్చారు. చంద్రబాబు ఇచ్చిన 5% రిజర్వేషన్ తీసేసినప్పుడు గానీ, అమ్మ ఒడి పథకానికి కాపు కార్పొరేషన్ నిధులు మళ్లించినప్పుడు గానీ ముద్రగడ నోరుమెదపలేదు.

దీనిబట్టే చంద్రబాబు హయాంలో ఎవరి ప్రోద్బలంతో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపించారో అర్ధం అవుతుందని టీడీపీ ఆరోపిస్తుంది. జగన్ అధికారంలోకి రాగానే తునిలో రైలు తగలబెట్టిన వారి మీద కేసులు ఉపసంహరించడమే ఇందుకు నిదర్శనం అని వారు ఆరోపిస్తున్నారు.