Mudragada Padmanabham Deadline on Kapu Reservationముద్రగడ పద్మనాభం అధ్యక్షతన కాసేపటిక్రితం కిర్లంపూడిలో కాపు జేఏసీ సమావేశం జరిగింది, కాపు రిజర్వేషన్‌పై కేబినెట్ తీర్మానం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ చేసి, ప్రభుత్వానికి కొత్త గడువు పెట్టారు ముద్రగడ. మార్చి 31వ తేదీ వరకు రిజర్వేషన్ లను అమలు చేయాలని,అప్పటికి అమ లు కాకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రకటించారు.

పదమూడు జిల్లాల నుంచి వచ్చిన కాపు నేతలు ఈ సమావేశంలో పాల్గొని దీనిపై చర్చించారు. బిసిలకు ఒక్క శాతం రిజర్వేషన్ లు తగ్గించకుండా తమకు రిజర్వేషన్ లు ఇవ్వాలని తాము కోరుతున్నామని ముద్రగడ చెప్పారు. అయితే ఇప్పటికే అసెంబ్లీలో బిల్ పాస్ అయినందున ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెయ్యగలిగింది ఏమి లేదు.

రిజర్వేషన్లు 50% దాటడంతో కేంద్రం నిర్ణయం అనివార్యం. వారి నిర్ణయం ఎలా ఉంటాదో తెలీదుగానీ చంద్రబాబు తాను చేయాల్సిందంతా చేశారనే అనుకోవాలి. ఇక్కడ నుండి ఇది బీజేపీ రాజకీయ నిర్ణయంతోనే ముడిపడి ఉంది. కావున దానికి రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇస్తే ఉపయోగం ఏంటో ముద్రగడకే తెలియాలి.

మొదటినుండి కూడా ముద్రగడ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పని చేస్తునట్టు కనిపిస్తుంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా ముద్రగడను మొత్తానికి పక్కన పెట్టి ఉన్నపళంగా రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆయన కూడా ఆశ్చర్యపోయారు. అయితే తిరిగి కోలుకుని మళ్ళి చంద్రబాబుని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.