MS Dhoni Movie Collections, MS Dhoni Movie Collections Record, MS Dhoni Movie Satellite Rights, MS Dhoni Movie Box Office Business TV Rightsబాలీవుడ్ నాట ‘బయోపిక్’లకు విశేషమైన ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఎవరో తెలియని వ్యక్తి గురించి సినిమా తీస్తేనే కోట్ల రూపాయల కలెక్షన్స్ వెల్లువలా వస్తున్నాయి. మరి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ఇండియన్ కెప్టెన్ ధోని గురించి సినిమా తీస్తే… ఇంకెంత వసూళ్లు రావాలి. విడుదలైతే ఎంత వస్తాయో ఇప్పుడే చెప్పలేం గానీ, విడుదలకు ముందే ఓ 60 కోట్లను తన అకౌంట్ లో వేసుకుంది ధోని బయోపిక్.

భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ జీవితంపై ‘ఎంఎస్ ధోనీ – ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రాన్ని నిర్మించేందుకు 80 కోట్లు ఖర్చు కాగా, శాటిలైట్ హక్కుల విక్రయం ద్వారా 45 కోట్లు, చిత్రంతో డీల్స్ కుదుర్చుకున్న పలు కంపెనీల ద్వారా 15 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ధోనీ జీవితంలో ఎవరికీ తెలియని పలు సంఘటనలను చిత్రంలో కూర్చడంతో పాటు, ఆయన టికెట్ కలెక్టర్ గా పనిచేసిన ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్లో, రాంచీలోని ధోనీ ఇంట్లో కూడా చిత్రాన్ని షూట్ చేశారు. ఈ చిత్రం ఈ నెల 30న వెండితెరను తాకనున్న సంగతి తెలిసిందే.