IPL-Match-updatesగత ఐపీఎల్ సీజన్లలో విశేషంగా రాణించిన రెండు జట్లు ప్రస్తుత సీజన్లో విజయాలు లేక కుదేలవుతున్నాయి. అందులో ముఖ్యమైనవి ఒకటి ముంబై ఇండియన్స్ కాగా, మరొకటి ధోని సారధ్యం వహిస్తున్న పూణే జట్టు. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన ముంబై కేవలం ఒక్క గెలుపుతో అడుగున ఉండగా, కొత్తగా ఐపీఎల్ లోకి చేరిన పూణే జట్టు కూడా ఇదే బాటలో పయనిస్తోంది.

నేడు మొహాలీ వేదికగా జరిగిన రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఘనవిజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్ లలో పేలవమైన ఆటతీరుతో విమర్శల పాలైన పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ రహానే (9), పీటర్సన్ (15), పెరీరా (8), ధోనీ (1), ఇర్ఫాన్ పఠాన్ (2) విఫలం కాగా, డుప్లెసిస్ (67), స్మిత్ (38) రాణించడంతో కనీసం ఆ మాత్రం స్కోర్ నైనా నమోదు చేయగలిగింది.

153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు మురళీ విజయ్ (53), వోహ్రా (51) అర్ధ సెంచరీలతో రాణించి మంచి శుభారంభం అందించారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ ఔటైన తర్వాత, మురుగన్ అశ్విన్ ధాటికి మార్ష్ (4), మిల్లర్ (7) కూడా త్వరగా పెవిలియన్ చేరారు. దీంతో కాస్త కంగారు పడ్డ పంజాబ్ జట్టును సాహా (4) అండతో మ్యాక్స్ వెల్ విజయానికి చేర్చాడు. 14 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 32 పరుగులతో చెలరేగడంతో 18.4 ఓవర్లో పంజాబ్ విజయం సాధించింది. పూణే జట్టు మాదిరే పంజాబ్ జట్టు కూడా మూడు మ్యాచ్ లలో ఒక్క విజయం సాధించింది.