Mahendra Singh Dhoni Cricketer Turns Bollywood Producer!భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని టీమిండియా నుండి సాగనంపడానికి రంగం సిద్ధమవుతోందా? ఏమో ఇప్పుడే చెప్పలేం గానీ, సంకేతాలు అయితే అలాగే ఉంటున్నాయి అన్న టాక్ వెలువడుతోంది. తాజా ధోనిని తక్కువ చేస్తూ, టీమిండియా కోచ్ రవిశాస్త్రి మరోసారి నోరు పారేసుకున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాయేనని ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తున్న వేళ రవిశాస్త్రి వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 వరల్డ్ కప్ కు జట్టును సిద్ధం చేయడంపై రవిశాస్త్రిని ప్రశ్నించిన వేళ, సాహా, అద్భుతంగా ఎదిగిపోయాడని, ఆయనకు మరెవరూ సాటిరారని అన్నారు.

వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్, క్యాచింగ్ విభాగాల్లో సాహా అత్యుత్తమ ఆటతీరును చూపిస్తున్నాడని, ఇప్పటికే ధోనీ స్థానాన్ని ఆక్రమించేశాడని అన్నారు. ధోనీ నీడలో ఎదుగుతూ వచ్చిన సాహా, ఆయన్నే మించిపోయాడని కితాబిచ్చారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం సాహానే నంబర్ వన్ వికెట్ కీపర్ గా అభివర్ణించిన రవిశాస్త్రి వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు. శ్రీలంకపై టెస్ట్ సిరీస్ గెలిచేపాటికి రవిశాస్త్రికి మరింత అహం పెరిగిందని కొందరు మండి పడుతుంటే… వన్డేలలో కూడా ధోనిని పక్కన పెట్టడానికి స్కెచ్ సిద్ధమవుతోందని, అందుకే ఈ వ్యాఖ్యలని విశ్లేషిస్తున్నారు.