Mr Majnu Trailer - Akhil Akkinen - Nidhhi Agerwalఒక పక్క తోలి ప్రేమ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీసిన దర్శకుడు వెంకీ అట్లూరి, మరో పక్క మన్మధుడు కుమారుడు అఖిల్ అక్కినేని కలిస్తే ఎలా ఉంటుంది? అంటే నిన్ననే మిస్టర్ మజ్ను ట్రైలర్ చూసాం గా అలా ఉంటుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ కట్ చేసిన విధానం చూస్తేనే అర్ధం అవుతుంది సినిమాలో మన హీరో మంచి ప్లే బాయ్ అని. మరో పక్క ఇదే విషయాన్ని మన జబర్దస్త్ ఆది చెప్పకనే చేప్పేసాడు.

ఇదిలా అంటే ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది అన్న విషయం పక్కన పెడితే, ఈ ట్రైలర్ చివర్లో “లాస్ట్ లో పెళ్లి చేసుకుంటాను ఆ టైపు లవ్వా?నాకలా చేతకాదు అంటూ ముగించారు.

అయితే ఈ సినిమాలో హీరో ఎక్కువకాలం ప్రేమించడానికి ఇష్టపడని వాడిలా ఉన్నాడు. మనం ఆరంజ్ సినిమాలో ఈ పాయింట్ ని ఆల్రెడీ చూసాం. “ఎక్కువకాలం లవ్ చెయ్యలేను..చేసింది కాసేపైనా మనస్ఫూర్తిగా ప్రేమించడమే నాకు ఇష్టం” అంటూ చెబుతాడు.

ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే టైపు పాయింట్ ఆధారంగానే కథను రూపొందించినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆరంజ్ కి, మజ్ను ని డిఫర్నెస్ ఏంటి అంటే, ఆరంజ్ లో హీరో ప్లే బాయ్ కాదు, కానీ ఇక్కడ హీరో ప్లే బాయ్.

అయితే మరో తేడా ఏంటి అంటే, టైం పాస్ కి అయితే లవ్ చేస్తా కానీ, పెళ్లి అంటే మాత్రం ఇష్టం లేదు అనే కాన్సెప్ట్ లాగా మజ్ను తెరకెక్కినట్లు అనిపిస్తుంది.