MP Avinash Reddyవైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడని సీబీఐ తేల్చి చెప్పేసింది కనుక అది నిరూపించేందుకే ఆయనను విచారణకు పిలిచి ఆ హత్యకు సంబందించిన వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే సీబీఐ రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి తనను ముందుగానే దోషిగా నిర్ధారించేసి, అది నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలతోనే విచారణ జరుపుతోందని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

కనుక సీబీఐ తనని అరెస్ట్ చేయడం ఖాయమని అవినాష్ రెడ్డి కూడా గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై స్పందించిన హైకోర్టు నేడు (సోమవారం)వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈరోజు మళ్ళీ ఆయన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియో, ఇతర సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత హైకోర్టు తీర్పు ప్రకటిస్తుంది. అవన్నీ అవినాష్ రెడ్డి నేరం చేసిన్నట్లు నిరూపించే బలమైన సాక్ష్యాధారాలు కనుక వాటిని పూర్తిగా పరిశీలించాలని సీబీఐ న్యాయవాది కోరారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించవద్దని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. అంటేఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం తధ్యమని హైకోర్టు వేదికగా సీబీఐ మరోసారి స్పష్టం చేసిందనుకోవచ్చు.

కనుక ఈ పిటిషన్‌పై హైకోర్టు తీర్పుచెప్పగానే సీబీఐ అవినాష్ రెడ్డిని మరోసారి ప్రశ్నించేందుకు రమ్మనమని పిలిచి విచారణ తర్వాత అరెస్ట్ చేయవచ్చు కనుక అప్పుడు ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఊరట పొందే ప్రయత్నం చేయవచ్చు. కనుక అవినాష్ రెడ్డికి-సీబీఐకి మద్య ఇక సుప్రీంకోర్టు మాత్రమే ఉందని భావించవచ్చు.

మొన్న సీబీఐ విచారణ ఎదుర్కొన్న తర్వాత అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “వివేకా ఆస్తి కోసమే ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఈ హత్య చేయించి ఉండవచ్చని సంచలన ఆరోపణలు చేశారు. కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి, బాధిత కుటుంబాన్నే నిందితులని వాదిస్తుండటం గమనిస్తే చనిపోయిన వివేకానందా రెడ్డి ఆత్మ ఘోషించకమానదు.