MP Siva Prasad with Amit Shah in tirupati in 2016అలిపిరి దగ్గర అమిత్ షా ముందు టీడీపీ చేసిన మెరుపు నిరసనకు సోషల్ మీడియాలో జనసేన, వైకాపా కార్యకర్తలు కొత్త ట్విస్టు ఇచ్చారు. కొండపైన అమిత్ షా దర్శనం చేసుకుని వస్తుండగా పక్కన టీడీపీ చిత్తూర్ ఎంపీ శివప్రసాద్ ఆయన పక్కనే ఉన్న ఫోటోను పెట్టి, కొండపైన లాలూచి కొండ కింద నిరసన డ్రామా అంటూ ప్రచారం చేసారు.

అయితే తొందరగానే టీడీపీ వారు ఈ దాడిని తిప్పికొట్టారు. సదరు ఫోటో 2016లో అమిత్ షా తిరుమల వచ్చిన సంధర్భంగా తీసిన ఫోటోలని, అప్పుడు టీడీపీ, బీజేపీ కలిసే ఉన్నాయి గనుక శివప్రసాద్ మర్యాదపూర్వకంగా అమిత్ షా వెనుక ఉన్నారని రుజువులతో సహా నిరూపించి ప్రత్యర్థులను సైలెంట్ చేసారు.

ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని పార్టీ శ్రేణులను ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణకు బద్ధులై అందరూ వ్యవహరించాలని.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలిసీ తెలియని ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తీసుకురావొద్దని.. ఏ సమయానికి ఎలా స్పందిచాలనేది అందరూ తెలుసుకోవాలని మందలించారు.