MP Kanumuru Raghu Rama Krishnam Rajuతమ పార్టీ రెబెల్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి షోకాజ్ నోటీసు పంపిన సంగతి తెలిసింది. వారం లోగా సమాధానం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటాం అంటే రోజు గడవకముందే సమాధానం వచ్చేసింది. అయితే ఎంపీగారు ఇచ్చిన సమాధానంలో సమాధానాలకంటే ప్రశ్నలే ఎక్కువగా ఉండటం గమనార్హం.

‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా ఉంటుంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారు? రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు?,” అంటూ డైరెక్టుగా పార్టీ మీద, అలాగే పార్టీలో నెంబర్ టూ అనబడే విజయసాయిరెడ్డి మీద ప్రత్యక్షంగానే ఎదురుదాడికి దిగారు.

“వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఛైర్మన్, సభ్యులెవరు? క్రమశిక్షణ సంఘం మినిట్స్ ఉంటే నాకు పంపండి’’ అని విజయసాయిరెడ్డిని రఘురామ కృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు. అందరికంటే మీరే ఎక్కువగా పార్టీకి నష్టం కలిగిస్తున్నారు రాజ్యాంగ స్ఫూర్తికి ప్రజాస్వామ్య స్ఫూర్తికు అంటూ విమర్శించడం గమనార్హం.

అయితే ఇప్పుడు జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. రఘు రామ కృష్ణం రాజుని సస్పెండ్ చేస్తారా? లేక ఆయన చూపించిన లూప్ హోల్స్ ని సవరించకుండా సస్పెండ్ చేస్తే దానికి చట్టబద్దత ఉంటుందా అనేది కూడా చూడాలి. మొత్తానికి రఘురామ రాజు వ్యవహారం పార్టీకి తలపోటుగా మారింది.