MP-Dharmapuri-Arvind-Vs-KCR-TRS-MIMతెలంగాణాలో హిందూ ముస్లిం ఫీలింగ్ కలిగించి బలపడాలని బీజేపీ ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందుకు ఎంఐఎంను, ఆ పార్టీకి తెరాసతో గల స్నేహాన్ని ఆ పార్టీ నేతలు వాడుకుంటున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌ కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సీఏఏ అవగాహన సదస్సులో నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసారు.

సీఎం కేసీఆర్‌పై, మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను గడ్డం లేని ముల్లాగా అభివర్ణించిన అరవింద్.. అసద్‌ గడ్డం కోసి కేసీఆర్‌కు అతికిస్తానని, అసద్‌ను నిజామాబాద్‌లో క్రేన్‌కు వేలాడదీస్తానని అన్నారు. “కేసీఆర్‌.. ముస్లింలకే ముఖ్యమంత్రా? టీఆర్‌ఎ్‌సకు 90 మంది ఎమ్మెల్యేలున్నారు.. హిందువులు ఓట్లేయకుండానే వారు గెలిచారా?” అని ప్రశ్నించారు.

మజ్లిస్‌కు కేసీఆర్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల ఓట్ల కోసమే పౌరసత్వ చట్టాన్ని కేసీఆర్‌ వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కుతెరాస ప్రభుత్వానికి, మజ్లిస్‌కు లేదన్నారు. నిజామాబాదు మేయర్ పదవి తెరాస ఎంఐఎంకు కేటాయిస్తుంది అనే వార్తల నేపథ్యంలో అరవింద్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది.

గత ఎన్నికలలో కేసీఆర్ కుమార్తె కవితని నిజామాబాదులో ఓడించి జైంట్ కిల్లర్ గా అవతరించారు అరవింద్. రానున్న మునిసిపల్ ఎన్నికలలో నిజామాబాదు లో బీజేపీని గెలిపిస్తే తనకు పార్టీలో ఎదురు ఉండదని, పార్టీ ప్రెసిడెంట్ పదవి కూడా దక్కవచ్చని ఆయన భావనగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆయన కామెంట్లు చేసినట్టు ఉన్నారు.