Movie Theatres packed for sankranthi releasesసంక్రాంతి అనేది తెలుగు వారికే కాదు తెలుగు సినిమాకు కూడా పెద్ద పండుగ. ఈ సీజన్ లో విడుదలయ్యే సినిమాలు వాటి రేంజ్ కి మించి వసూళ్ళు రాబడతాయి. అయితే ఈ సారి సంక్రాంతి మాత్రం అన్నిటికంటే భిన్నమైనది. కరోనా కారణంగా 50% సీట్లతోనే థియేటర్లు తెరుచుకున్నాయి.

ఈ కారణంగా పెద్ద సినిమాలు ఏవీ థియేటర్లలోకి రాలేదు. అయితే ప్రేక్షకులు అందరి అంచనాలు తారుమారు చేస్తూ తండోపతండాలుగా థియేటర్లకు వచ్చి థియేటర్ బిజినెస్ కు డోకా లేదని నిరూపించారు. ప్రేక్షకుల హింట్ ని పట్టిన నిర్మాతలు వరుసగా తమ సినిమాలు విడుదల చెయ్యడానికి సిద్ధం అయిపోయారు.

ఒకపక్క వ్యాక్సిన్ కూడా వచ్చెయ్యడంతో వారు మరింత ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే సంక్రాంతి తరువాత వారానికి ఒక సినిమా లెక్కన ఫిబ్రవరి మధ్య వరకు రిలీజ్ డేట్లు ప్రకటించేశారు. అది సరిపోనట్టు డోజన్ కు పైగా సినిమాల పోస్టర్లు ఈ భోగి, సంక్రాంతి రోజులలో విడుదల అయ్యాయి.

దాదాపుగా అన్ని సినిమాలు వేసవి లోగా విడుదల అయ్యేవే. అంటే రానున్న ఆరు నెలల కాలం టాలీవుడ్ అత్యంత కోలాహలంగా ఉండబోతుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే… తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో తప్ప ఇంకా ఎక్కడా ఈ స్థాయి హంగామా లేదు. ఇక కొత్త వేవ్ల పేరిట కరోనా ట్విస్టులు ఏమీ లేకపోతే టాలీవుడ్ కి మంచి రోజులు వచ్చేసినట్టే.