Movie Shootings in telangana government stopped due to covid19తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…. ప్రభుత్వానికి రెండు మూడు నెలల వరకు థియేటర్లు ఓపెన్ చేసే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పట్లో సినిమా, సీరియళ్ల షూటింగులు కూడా మొదలుపెట్టే అవకాశం లేదని కూడా తేల్చి చెప్పడంతో పరిశ్రమలో నిస్సత్తువ ఆవహించింది.

అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి రెండు షరతులు పెట్టిందట. షూటింగ్ ప్రారంభమయ్యే ముందు నిర్మాత సినిమాకు పని చేసే వారందరికి యొక్క కరోనావైరస్ నెగటివ్ సర్టిఫికేట్ను సమర్పించాలి. పదిహేను రోజులకు ఓ సారి ఇటువంటి సర్టిఫికెట్ సమర్పించాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అలాగే.

అలాగే ఒక సీరియల్ కు పని చేసేటప్పుడు పాజిటివ్‌గా వచ్చి, ఎవరైనా చనిపోతే కుటుంబానికి 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. షూటింగులకు పర్మిషన్ ఇచ్చే ముందే నిర్మాతలు కోటి రూపాయిలు స్థానిక కలెక్టర్ వద్ద డిపాజిట్ చెయ్యాలంటే… చిన్న నిర్మాతలకు ఇది దాదాపుగా అసాధ్యం. సెట్స్ మీద కాకుండా బయట ఈ వైరస్ సోకినా నిర్మాతలదే బాధ్యత.

దీనితో చాలా మంది నిర్మాతలు ఒప్పుకోలేదట. దీనితో ప్రభుత్వం పర్మిషన్ నిరాకరించిందని పరిశ్రమలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. కనీసం పోస్టు ప్రొడక్షన్ పనులకైనా పర్మిషన్ ఇస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో కనీసం 60 సినిమాలు పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అది పూర్తి అయితే కనీసం ఓటీటీలలోనైన సినిమాలు విడుదల చేసుకోవచ్చు.