Movie Artists Association - MAA- controversy-టాలీవుడ్ మా అసోసియేషన్ వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్ ఒక మీటింగ్ నిర్వహించి నరేష్ ను దించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. మీటింగ్‌కు నరేష్ తప్ప మిగిలిన సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ వర్గం..జీవితా రాజశేఖర్ వర్గం పై మాటల దాడి చేసారు.

ఈ సందర్భంగా మీటింగ్ మొత్తం రసాభాసాగా మారింది. సభ్యులకు సర్దుచెబుతామని ప్రయత్నించిన పరుచూరి గోపాలకృష్ణ పెద్దరికం కూడా పని చెయ్యకపోవడం తో ఆయన తడిచిన కళ్లతో బయటకు వెళ్లిపోయారు. ఇది ఇలా ఉండగా నరేష్ మీద జీవిత వర్గం ఎదురుదాడి ప్రారంభించింది. ఇప్పటికే హేమ, పృథ్వి లాంటి వారు మీడియా ముందుకు వచ్చి నరేష్ మీద విమర్శలు చేసారు.

అయితే ఇండస్ట్రీలో ఉండే టాక్ ఏంటంటే ఇది మా మీద పెత్తనం కోసం ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గం చేస్తున్న ప్రయత్నం ఇది. జీవిత, రాజశేఖర్, హేమ, పృథ్వి వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. వారు నరేష్ ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారట. కృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలమైనా అదే కుటుంబంలోని గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉండడంతో ఆ కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ వారు ఓన్ చేసుకోలేకపోతున్నారట.

ప్రభుత్వంలోని పెద్దల అండదండలు వారికి ఉన్నాయో లేదో తెలీదు గానీ ఆ పరపతిని మాత్రం వారు వాడుకుంటున్నారు. అయితే నరేష్ ని కూడా ఈ విషయంలో తప్పుపట్టాల్సిందే. ఆయన కూడా ఈగోకి పోయి మిగతా సభ్యుల మద్దతు కూడగట్టలేకపోతున్నారట. ఈ వివాదం, ఆధిపత్య పోరు ఎలా ఉన్నా ప్రజల దృష్టిలో మా పరపతి పలచన అవుతుంది.