mothkupalli-narsimhulu feels insulted by chandraabu naiduతెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు పార్టీ మారడానికి సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. టీడీపీని తెరాసలో విలీనం చెయ్యాలని బహిరంగంగా ప్రకటించి చంద్రబాబు ఆగ్రహానికి గురైన ఆయన దళితుడిని కాబట్టే మహానాడుకు పిలవలేదు అని పార్టీని ఇరుకున పెట్టె ప్రయత్నం చేసారు.

చంద్రబాబు కంటే తెలంగాణ సీఎం కేసీఆరే నయమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఆయన చేసిన వ్యాఖ్యల బట్టే ఆయనను ఎందుకు దూరం పెట్టారో అర్ధం కాకమానదు. కేసీఆర్‌ను చూస్తే ఎన్టీఆర్‌ గుర్తుకువస్తరు. పేదోడికి, తిండికి లేనోడికి కేసీఆర్‌ రాజ్యసభ అవకాశం ఇచ్చిండు అని పొగుడుతున్న మోత్కుపల్లి చంద్రబాబు పిలిస్తే వెళ్ళి మాట్లాడతా పార్టీలోనే ఉంటా అంటున్నారు.

అంతా చేసి నన్ను పట్టించుకోవాలి, పిలిచి మాట్లాడాలి అంటే ఎలా? రేపన్న రోజు కనీసం పిలవకుండా అవమానించారు అని అనడానికి కదా ఆ మాట. అసలు గవర్నర్ గిరి వస్తాదనే ఆశ లేకపోతే మోత్కుపల్లి ఈ పాటికి ఎప్పుడో తెరాసలో జాయిన్ అయ్యే వారే కదా? ఇటువంటి తరుణంలో రేవంత్ లాంటి వారిని విమర్శించే అవకాశం ఎక్కడ ఉంది?