Mother Daughter Buried Alive in Haripuram Village Srikakulamవైసీపీ నేతల అరాచకాలకు పరాకాష్ట అని చెప్పుకోదగ్గ చాలా బాధాకరమైన, అమానవీయమైన ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని హరిపురం గ్రామంలో జరిగింది. గ్రామంలో నివశిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రి అనే ఇద్దరు మహిళలకు చెందిన 60 గజాల కంటే చిన్న స్థలం ఒకటి ఉంది. దానిపై స్థానిక వైసీపీ నేతలైన కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాష్ రావు కన్ను పడటంతో ఇద్దరు మహిళలను వారి కుటుంబ సభ్యులను ఆ స్థలాన్ని తమకి అప్పజెప్పవలసిందిగా చాలా కాలంగా ఒత్తిడి చేస్తున్నారు. కానీ అందుకు తాము అంగీకరించకపోవడంతో ఇల్లు ఖాళీ చేసివెళ్లిపోవాలని, ఊరొదిలిపోవాలని లేకుంటే మీ భర్త, పిల్లలని కొడతాం… చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆ మహిళలు కన్నీళ్లు పెట్టుకొంటూ చెప్పారు.

ఈరోజు ఉదయం సదరు వైసీపీ నేతలు ట్రాక్టరుతో ఎర్రమట్టి తీసుకువచ్చి ఆ స్థలంలో పోసేందుకు ప్రయత్నిస్తుండటం చూసి వారిద్దరూ వెంటనే వెళ్ళి వారికి అడ్డుపడ్డారు. పక్కకువెళ్ళకపోతే ఇద్దరినీ ఇదే మట్టిపోసి పాతిపెట్టేస్తాం… అంటూ వైసీపీ నేతలు బెదిరించినా వారు కదలకపోవడం, ఆ ట్రాక్టరులో మట్టిని ఆ మహిళలపైనే ఒప్పించారు. నడుములోతు మట్టిలో కూరుకుపోయిన ఆ మహిళలను ‘అలాగే… చావండి…’ అంటూ వెళ్ళిపోయారు.

ఇది చూసి చుట్టుపక్కల యువకులు పరుగున వచ్చి పారలతో వారి చుట్టూ ఉన్న మట్టిని తవ్వి పక్కకి పోసి ఇద్దరు మహిళలను బయటకు తీసి కాపాడారు. వైసీపీ నేతలిద్దరూ జిల్లాకే చెందిన పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరులు కావడంతో వారి ఆగడాలకు అంతే లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిల దయనీయ పరిస్థితి, వైసీపీ నేతల కిరాతకం అర్దం అవుతుంది.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే అది రాష్ట్రంలో మహిళలను అవమానించడమే అంటూ ఆయనకి నోటీస్ పంపిన మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, మరి ఈ ఘటనపై ఇంకా ఎప్పుడు స్పందిస్తారో? వైసీపీ నేతలు ముగ్గురూ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరులు కనుక మహిళా కమీషన్‌ మంతికి ఇది కనబడుతుందో లేదో?