Most Eligible Bachelor అఖిల్ అక్కినేని రాబోయే చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇంతకుముందు విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌లో, ఈ చిత్రం కోసం సంక్రాంతి విడుదల గురించి మేకర్స్ సూచించినప్పటికీ ఈ సినిమా అప్పటికి రావడం లేదని సమాచారం. అఖిల్ తన మొదటి మూడు చిత్రాలతో డిజాస్టర్ల హాట్రిక్ పూర్తి చేసిన తరువాత వస్తున్న ఈ చిత్రం చాలా కీలకం.

కాబట్టి, ఈ చిత్రాన్ని సమ్మర్‌కు నెట్టాలని మేకర్స్ నిర్ణయించారు. ఇది భారీ వాయిదా అనే చెప్పుకోవాలి కానీ ప్రస్తుతం కరోనా కారణంగా ఉన్న అనిశ్చితితో, ఇది తప్పడం లేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్‌ను హ్యాపనింగ్ హీరోయిన్ పూజా హెగ్డే రొమాన్స్ చేస్తున్నారు. 2013లో ‘ఒంగోలు గిత్త’ తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్‌ సినిమా చేస్తున్నాడు.

కేరీర్ లో ఒక్క హిట్ కూడా లేని టైం లో భాస్కర్ వంటి అవుట్ అఫ్ ది ఫామ్ దర్శకుడితో నటించడం అంటే సాహసం అనే అనుకోవాలి. దానితో ఈ సినిమా సక్సెస్ కావడం దర్శకుడికి కూడా చాలా ఇంపార్టెంట్. గీత ఆర్ట్స్ సంస్థకు చెందిన జీఏ2 పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.

గత కొంత కాలంగా ఈ సంస్థ హిట్లకు చిరునామాగా మారింది. ఈ సంస్థ భలే భలే మగాడివోయ్ తో నానికి, ప్రతి రోజూ పండగే తో సాయి ధరమ్ తేజ్ కు, గీత గోవిందంతో విజయ్ దేవరకొండకు తమ కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చింది. దీనితో అక్కినేని అభిమానులు ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నారు.