more jobs for women in Anantapur Kia Motors అనంతపురంలో రానున్న ప్రతిష్ఠాత్మక ‘కియా’ కార్ల కంపెనీ పెద్దఎత్తున మహిళా ఉద్యోగులను నియమించుకోవడానికి ఆసక్తి కనబరుస్తోంది. ప్రధాన ప్లాంటుకు అనుబంధంగా విడిభాగాలు తయారు చేసే సంస్థలు పెద్దఎత్తున అనంతపురానికి రానున్నాయి. ఈ కొంపెనీలలో దాదాపు 20000 ఉద్యోగాలు రానున్నాయి.

ఇందులో దాదాపు సగం ఉద్యోగాలలో మహిళలకు అవకాశాలు కల్పించాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. తొలిదశలో దాదాపు 2500 మంది మహిళలకు ఇక్కడ ఉద్యోగాలు రానున్నాయి. అనంతపురం, దాని చుట్టుపక్కల ప్రాంతంలోని మహిళలకు ఆటోమొబైల్‌ తయారీ పరిశ్రమకు సంబంధించి నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి వారినే తీసుకోనున్నారు.

కియా ప్లాంటుకు అనుబంధంగా ఇప్పటికే 19 అనుబంధ సంస్థలు వచ్చాయి. తాజాగా మరో 20 అనుబంధ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించాయి. నవంబరులో ఈ కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఈ కంపనీ కరువు సీమ రూపురేఖలే మారిపోనున్నాయి.

కియా మోటర్స్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆటొమొబైల్ కంపనీ. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపనీ ఇండియాలో తొలి ప్లాంట్ అనంతపురంలోనే పెడుతుంది. ప్లాంట్ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఈ ప్లాంట్‌లోని తొలి కార్ తయారై 2019 ఫిబ్రవరిలో మార్కెట్ లోకి రాబోతుంది.