Mopidevi -Venkataramanaఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వాదన వింతగా ఉంది. రాష్ట్రంలో కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ఆ విమర్శలను తట్టుకునే క్రమంలో టీడీపీపై నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది. కరోనా వ్యాప్తికి టీడీపీ కార్యకర్తలు స్లీపర్ సెల్సులా పని చేస్తున్నారని ఆరోపించారు. కరోనా వ్యాప్తికి టీడీపీ కుట్రలు చేసిందేమోనన్న అనుమానం వస్తోందన్నారు.

కొత్త ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి కారణం టీడీపీనేనన్న అనుమానం వస్తోందని చెప్పారు. మంత్రి ఆరోపణ పూర్తిగా బాధ్యతారాహిత్యంగా కనిపిస్తుంది. కరోనా ని కంట్రోల్ చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిది ఒకవేళ టీడీపీ వారు నిజంగా అటువంటి ప్రయత్నం చేసినా దానిని ఆపి ప్రజల ముందు పెట్టాల్సింది పోయి…. మీడియా ముందు వట్టి ఆరోపణలు చెయ్యడం ప్రజలు తమకు ఇచ్చిన అపూర్వమైన తీర్పుని అపహాస్యం చెయ్యడమే అని కొందరు అంటున్నారు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది… లాక్ డౌన్ ని ఉల్లంఘిస్తూ… వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలు ఎవరూ బయటకు రావడం లేదని… చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చున్నారని విమర్శలు చేసేదీ వారే.

ఇది ఇలా ఉండగా… వారం రోజులగా ఆంధ్రప్రదేశ్ లో కేసుల ఉదృతి పెరుగుతుంది. గత 24 గంటల్లో 80 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటితో రాష్ట్రంలోని మొత్తం కేసులు 1,177కు చేరాయి. కొత్త కేసులలో 33 కేసులు కృష్ణ జిల్లాకు చెందినవి, మరో 23 గుంటూరుకు చెందినవి, 13 కేసులు కర్నూలుకు చెందినవి.

https://twitter.com/thedk9999/status/1254704126446891009