Moon Landing Scientists Death, Moon Landing Scientists Death Mystery, Moon Landing Neil Armstrong Death, Moon Landing  Scientists Mystery NASAవ్యోమగామి జేమ్స్ ఇర్విన్ తన 43 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు.
అంతకు ఓ సంవత్సరం ముందు రాన్ ఈవన్స్ తన 56 ఏళ్ల వయసులో గుండెపోటుతోనే మరణించారు.
ఇక తొలిసారిగా చంద్రుడిపై నడిచి చరిత్రలో నిలిచిపోయిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కూడా గుండె సమస్యతోనే తన 82వ ఏట 2012లో మృతి చెందారు.
మొత్తం మీద నాసా ట్రైనింగ్ ఇచ్చి అంతరిక్షంలోకి పంపించిన ఆస్ట్రోనాట్లలో ఇప్పటివరకూ 77 మంది గుండె, రక్తనాళాల సంబంధ సమస్యలతోనే మృతి చెందారు.

దీంతో అంతరిక్షంలోకి వెళ్లి వస్తే గుండె సమస్యలు తప్పవా? అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు పరిశోధకులు నడుం బిగించి తమ వంతు ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నా అవేమీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇర్విన్, ఇవాన్స్, ఆర్మ్ స్ట్రాంగ్ మరణాలకు ఒకే కారణం కనిపిస్తోందని, వీరందరిలో కామన్ గా కనిపిస్తున్నది ఒక్క చంద్రుడు మాత్రమేనని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ గుండె జబ్బుల నిపుణుడు మైఖేల్ డెల్ప్ తాజాగా వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకూ కేవలం 24 మంది మాత్రమే భూమి కక్ష్యను దాటి అంతరిక్షంలోకి ప్రయాణాలు సాగించారని మిగతా వారంతా భూ కక్ష్యను దాటకుండా స్పేస్ సెంటర్ కే పరిమితం అయ్యారని అధికారులు చెబుతున్నారు. అంతరిక్ష లోతుల్లోకి వెళ్లిన వారికి రక్తనాళాలు, గుండెపై ఒత్తిడి పడే అవకాశాలు ఉన్నాయన్న భావన నెలకొందని వ్యాఖ్యానించిన డెల్ప్, అక్కడికి వెళ్లి పరిశోధనలు సాగిస్తేనే ఫలితాలు వెలువడతాయని చెప్పడం గమనార్హం. ఏది ఏమైనా చంద్రుడిని తాకి వచ్చిన వారంతా ఒకే రకమైన మరణాలకు గురికావడం ఇప్పటికి సస్పెన్సే మరి!