Money Heist - Part -5“మనీ హేస్ట్” వెబ్ సిరీస్ ప్రేమికులకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటివరకు విడుదలైన 5.1 సీజన్లు విజయవంతం కాగా, ఫైనల్ సీజన్ గా 5.2 డిసెంబర్ 3వ తేదీన నెట్ ఫ్లిక్స్ ద్వారా వీక్షకులను పలకరించనుంది. దీంతో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి.

ఈ సీజన్ కు సంబంధించిన షూటింగ్ వీడియోలతో పాటు, కీలక పాత్రధారులు ఇచ్చిన ఇంటర్వ్యూలతో కూడిన ఓ షార్ట్ వీడియోను విడుదల చేసారు. ప్రొఫెసర్ చెప్పిన ప్రకారం… చివరి 5 ఎపిసోడ్స్ చూసిన తర్వాత నిద్రపట్టదని, ప్రతి ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు.

మొత్తం 5 సీజన్లలో కూడా ప్రొఫెసర్ క్యారెక్టర్ అద్భుతంగా పండింది. దీంతో ఈ ప్రమోషన్ వీడియోలో ప్రొఫెసర్ చేసిన కామెంట్స్ కు ప్రాధాన్యత లభించింది. బంగారాన్ని కరిగించి బయటకు తీసుకువెళ్తారా? లేక పోలీసులకు పట్టుబడి పోతారా? అన్న క్లైమాక్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు.

https://pbs.twimg.com/media/FEaFYi8XEAMaHnY?format=jpg&name=large