మనీ హేస్ట్... వన్ లాస్ట్ టైం..!వెబ్ సిరీస్ లలో “మనీ హేస్ట్” పట్ల ప్రేక్షకులలో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 5 సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ లో చివరి భాగమైన 5.2 సీజన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బంగారాన్ని ప్రొఫెసర్ సొంతం చేసుకోగలిగారా? పోలీసుల నుండి తన గ్యాంగ్ ను ప్రొఫెసర్ రక్షించగలిగారా? అంటే…

అలాంటి క్లైమాక్స్ లేకపోతే ప్రేక్షకుల మెప్పు పొందడం సాధ్యం కాదు గనుక, ప్రేక్షకుల అభిరుచి మేరకే “మనీ హేస్ట్” క్లైమాక్స్ ఉంది. అయితే ఎలాంటి ట్విస్ట్ ల నడుమ ఈ క్లైమాక్స్ ను అందించారు అనేది “మనీ హేస్ట్”లో ప్రొఫెసర్ క్యారెక్టర్ కున్న స్పెషాలిటీ.

ఈ ఫైనల్ సీజన్ లో ఉన్న 5 ఎపిసోడ్స్ లో చివరి ఎపిసోడ్ మాత్రం ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా ప్రొఫెసర్ మరోసారి తన బ్రెయిన్ కు పనిచెప్తూ పోలీసులకు లొంగిపోయి, వారి వద్దే ఉంటూ నడిపించిన కధనం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది.

ఈ సీజన్ తో ‘మనీ హేస్ట్’ మొత్తం కధ ముగిసిపోయింది. ఇక తదుపరి విభాగంలో ‘బెర్లిన్’ క్యారెక్టర్ పేరుతో మరో వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇటీవల నెట్ ఫ్లిక్స్ స్పష్టం చేసింది. 2023లో ‘బెర్లిన్’ను విడుదల చేయబోతున్నట్లుగా కూడా తెలిపింది.