Mohini---Moviebuff-Sneak-Peek---Trishaఎన్నాళ్ళుగానో వాయిదాలు పడుతూ వస్తోన్న “మోహిని” సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాపై అటు తమిళ ఇండస్ట్రీలో గానీ, ఇటు తెలుగులో గానీ ఎలాంటి బజ్ లేదు. దీంతో ప్రేక్షకుల ఆసక్తిని రాబట్టేందుకు ఈ సినిమాలోని ఓ సీన్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ “మోహిని” సినిమాలో దర్శకుడు భయపెట్టాలనుకునే ఓ సన్నివేశాన్ని రిలీజ్ చేసారు. ప్రేక్షకులలో ఆసక్తి పెంచడానికి సినిమాలో ఉన్న బెస్ట్ సీన్ ను రిలీజ్ చేస్తుంటారు. కానీ ‘మోహిని’ సినిమాలో ఇదే బెస్ట్ సీన్ అని చిత్ర యూనిట్ భావించిందో లేక బెస్ట్ సీన్స్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించాలని దాచిపెట్టారో గానీ, రిలీజ్ చేసిన సన్నివేశం మాత్రం పేలవంగా ఉంది.

ఇలాంటి సన్నివేశాలను ప్రేక్షకులు ఇప్పటికీ కొన్ని వందల, వేల సార్లు వీక్షించి ఉంటారు. మరి అలాంటి సీన్ ను రిలీజ్ చేసి ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో అర్ధం కాని పరిస్థితి. రమణ మదేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష లీడ్ రోల్ చేయగా, జాకి భాగ్నని ఆమెకు జంటగా నటించాడు.