Manamantha Teaser, Manamantha Teaser talk, Manamantha Trailer, Manamantha Trailer talk, Manamantha cast,  Manamantha Chandra Sekhar Yeleti, Mohanlal Mannamantha“ఐతే… అనుకోకుండా ఒక రోజు… ఒక్కడున్నాడు… ప్రయాణం… సాహాసం…” ఈ సినిమా పేర్లన్నీ చెప్తే మొదటగా గుర్తుకు వచ్చేది దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి పేరు. రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా వినూత్నమైన కధలను ఎంపిక చేసుకోవడం చంద్రశేఖర్ స్పెషాలిటీ. ఇప్పుడు ఆ దర్శకుడు లైబ్రరీలోకి మరో విలక్షణమైన సినిమా వచ్చి చేరబోతోంది.

ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. ఓ నలుగురికి సంబంధించిన కధలను వినూత్నంగా తెరకెక్కించారని టీజర్ స్పష్టం చేసింది. మోహన్ లాల్, గౌతమి వంటి స్టార్ స్టేటస్ సినిమాకు ఫ్రెష్ లుక్ ను తీసుకువచ్చింది. ఫ్యామిలీ ఏమోషన్స్ బలంగా కనపడుతున్న ఈ సినిమా కధ గతంలో వచ్చిన ‘ఓం శాంతి, వేదం’ సినిమాల తరహాలో రూపొందడంతో ‘మనమంతా’ సినిమాలో మ్యాటర్ ఇంకేమైనా ఉందేమో చూడాలి.