Janatha Garage, Janatha Garage Audio Launch, Janatha Garage Malayalam Audio Launch, Janatha Garage Mollywood Audio Launch, Mohanlal Janatha Garage Malayalam Audio Launchఇప్పటికే విడుదలై, యంగ్ టైగర్ అభిమానులను అలరిస్తున్న “జనతా గ్యారేజ్” పాటలకు మళ్ళీ ఆడియో వేడుక ఏంటి అనుకుంటే… పొరపాటే..! ఇటీవల విడుదలైంది ఒక్క తెలుగు పాటలు మాత్రమే. టాలీవుడ్ తో పాటు మాలీవుడ్ లోనూ ‘జనతా గ్యారేజ్’ సందడి చేయనున్న విషయం తెలిసిందే. దీంతో మలయాళ వర్షన్ కు సంబంధించిన ఆడియో వేడుకకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

సెప్టెంబర్ 2వ తేదీన “జనతా గ్యారేజ్” తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న నేపధ్యంలో, విడుదల తేదీకి ఒక వారం ముందుగా ఆగష్టు 26వ తేదీన ‘జనతా గ్యారేజ్’ మలయాళ వర్షన్ ఆడియోను విడుదల చేయబోతున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడంతో, మాలీవుడ్ లో కూడా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది.

‘బాహుబలి’ సినిమా విజయం నుండి తెలుగు సినిమాలు ద్విభాషా చిత్రాలుగా రూపొందడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. తెలుగు హీరోలకు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో దక్షిణాదిలో తమ సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించుకునే క్రమంలో ముందడుగులు వేస్తున్నారు మన స్టార్ హీరోలు.