Mohanlal fires on journalistసమయం, సందర్భం లేకుండా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నపై సూపర్ స్టార్ మోహన్ లాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళలోని వెల్లింగ్టన్ ద్వీపాన్ని మోహన్ లాల్ సందర్శించిన వేళ.., అక్కడికి విచ్చేసిన మీడియా బృందంలోని ఓ వ్యక్తి…. ‘ఇటీవల క్రైస్తవ సన్యాసినిపై జరిగిన అత్యాచారంపై స్పందించాల్సిందిగా’ కోరారు.

దీంతో ఆగ్రహించిన మోహన్ లాల్, “ఇటువంటి సమయంలో అనవసరపు ప్రశ్నలు అడుగుతున్నారు, సిగ్గుగా లేదా? ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి , రేప్ ఘటనకు సంబంధం ఏంటి? ఆపద సమయంలో చేయాల్సిన మంచి కార్యక్రమాలను వదిలిపెట్టి, ఇలాంటి అసందర్భపు వేయడమేంటి?’ అని మండిపడిన సూపర్ స్టార్, ఆ తర్వాత పాల్గొనాల్సిన విలేఖరుల సమావేశంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు.