mohana krishna indraganti naniనాని హీరోగా ‘అష్టాచమ్మా’ చిత్రంతో పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా సక్సెస్‌ అయిన హీరోగా నాని మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం నాని టాలీవుడ్‌లో ఒక క్రేజీ హీరో అనే విషయం తెల్సిందే. ఇక ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన మోహనకృష్ణ మాత్రం అదే స్థాయిలో ఉన్నాడు. ఈయన చేసే సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకునేలా ఉంటాయి, కాని కమర్షియల్‌గా మాత్రం సక్సెస్‌ అవ్వడం లేదు. హీరోగా తనకు లైఫ్‌ ఇచ్చిన దర్శకుడితో నాని మళ్లీ కలిసి పని చేయబోతున్నాడు.

‘అష్టాచమా’కు సీక్వెల్‌గా ఒక సినిమా రాబోతుంది అంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. నాని, మోహనకృష్ణ ఇంద్రగంటిల కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న మాట వాస్తవమే కాని, అది ‘అష్టాచమ్మా’కు సీక్వెల్‌ కాదు అని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న నాని వచ్చే నెల నుండి మోహనకృష్ణ చిత్రంలో నటించేందుకు కమిట్‌ అయ్యాడు. వచ్చే నెలలో సినిమాను లాంచనంగా ప్రారంభించబోతున్నట్లుగా దర్శకుడు ప్రకటించాడు. ఈ కాంబినేషన్‌లో మూవీ ‘అష్టా చమ్మా’ ఫలితాన్ని రిపీట్‌ చేయడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.