mohan babu son of india Event పాపం… ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే ఎదురుపడిన వ్యక్తులను మోహన్ బాబు అడుగుతారట, ‘నాకు నమస్కారం పెట్టారా? నాకు గుడ్ మార్నింగ్ చెప్పారా?’ అని – ఇది జనసేన నేత కళ్యాణ్ దిలీప్ సుంకర సరిగ్గా ఓ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు.

కట్ చేస్తే… శనివారం నాడు మోహన్ బాబు నటించిన “సన్నాఫ్ ఇండియా” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో జరిగిన ఓ ఉదంతం సోషల్ మీడియా ట్రోలింగ్ కు కారణమైంది. కళ్యాణ్ దిలీప్ సుంకర చెప్పిన దానికి, ఈ వేదిక పైన జరిగిన దానికి పోలిక ఉండడం గమనించదగ్గ పరిణామం.

దర్శకుడు డైమండ్ రత్నబాబు గురించి మోహన్ బాబు మాట్లాడుతున్న సందర్భాల్లో డైరెక్టర్ వచ్చి కరచాలనం చేయగా, ‘వద్దొద్దు అట్లాంటి పని చేయొద్దు, నువ్వు గబుక్కున నా కాళ్లకు నమస్కారం చేద్దామని ఆలోచిస్తున్నావు, కాళ్లకు నమస్కారం చేయమని చెప్పను, నాకు ఇష్టం లేదు, నువ్వు అట్లా చూసావు, చేద్దామా వద్దా ఏమైనా అనుకుంటాడేమో అని, నువ్వు చేస్తే నాకు అగౌరవం’ అంటూ కలెక్షన్ కింగ్ చెప్పుకొచ్చారు.

ఈ వీడియో సోషల్ మీడియా ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. ఈ వీడియోలో గమనించదగ్గ విషయం ఏమిటంటే… మోహన్ బాబు ప్రసంగిస్తున్న సమయంలో పక్కనే ఉన్న అలీ అండ్ కో నవ్వులతో మునిగిపోయారు. అదే నవ్వులు నెటిజన్లు కూడా నవ్వుకుంటున్నారు. ‘సన్నాఫ్ ఇండియా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ సందర్భంగా గుర్తింపు లభించినట్లయింది.