Mohan Babu Rajinikanth Lunch Dinner Bonding, Mohan Babu Rajinikanth Private Bonding, Mohan Babu Rajinikanth Friendship Secrets తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ – డైలాగ్ కింగ్ మోహన్ బాబుల మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలిసిన విషయమే. ఆ చిరకాల మిత్రులు ఇటీవల కలిసిన సందర్భం గురించి మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. “నా బెస్ట్ ఫ్రెండ్ ను కలిశాను. కింగ్ లా ఉన్నాడు, ఈ కలియుగంలో అతను దుర్యోధనుడు, నేను కర్ణుడు’ అంటూ తమ స్నేహబంధం గురించి గొప్పగా చెప్పుకున్నారు మోహన్ బాబు.

అంతే కాకుండా, ‘చాలా కాలం తర్వాత చెల్లెలు లతను కలిశాను. రజనీకాంత్ విజయం వెనుక ఆమె కూడా ఉందని నేను బలంగా నమ్ముతాను’ అంటూ మరో ట్వీట్ లో మోహన్ బాబు పేర్కొన్నారు. రజనీ, మోహన్ బాబు ఆప్యాయంగా ఉన్న ఫొటోలతో పాటు, రజనీ భార్య లత, తనకు రాఖీ కడుతున్న మరో ఫొటోను కూడా పోస్ట్ చేశారు. నిరాడంబరుడైన రజనీకాంత్ తో ఉన్న స్నేహం గురించి వీలు చిక్కినప్పుడల్లా మన కలెక్షన్ కింగ్ ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు.