అప్పుడు సారా తాగేవాడిని... ఇప్పుడు విస్కీ తాగుతున్నా..!తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గురించి తెలియని వారుండరు. చిత్రపరిశ్రమకు విలన్ గా పరిచయమై స్టార్ హీరోగా ఎదిగారు మోహన్ బాబు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ నేపథ్క్ష్యంగా తెరకెక్కిన ఎన్నో సినిమాల్లో నటించారు. డైలాగులతో అదరగొట్టడమే కాదు…కలెక్షన్స్ కూడా కింగ్ అనిపించుకున్నారు మోహన్ బాబు.

తాజాగా మోహన్ బాబు, బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోకి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ షోలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారాయన. తనకున్న మద్యం అలవాటు గురించి వివరించారు.

Also Read – అప్పుడు బెదిరించి, ఇప్పుడు బకాయిలు చెల్లించేశారట!

మద్రాసులో కెరీర్ ప్రారంభించిన రోజుల్లో తాను సారా తాగేవాడినని చెప్పుకొచ్చారు. కోడంబాకం బ్రిడ్జి కింద కొన్ని సారా దుకాణాల్లో …ఓ స్నేహితుడితో కలిసి సారా తాగేవాడినని తెలిపారు. కెరీర్ సాఫీగా సాగని రోజుల్లోనూ సారా తాగినట్లు వివరించారు. ఇప్పుడు దేవుడు తనకు అన్నీ ఇవ్వడంతో…కాస్త మంచి విస్కీ తాగుతున్నాని చెప్పారు.