Mohan Babu as A2 in chequie bounce caseఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. సలీమ్ సినిమాకు గానూ దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఇవ్వాల్సిన 40లక్షల చెక్‌బౌన్స్‌కు సంబంధించి 2010లో ఆ దర్శకుడు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి విచారణ జరుగుతుండగా, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఇందులో ఎ1గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌కు రూ.10వేల జరిమానా, ఏ2గా ఉన్న మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41,75,000 చెల్లించాలని ఆదేశించింది.

ఒక వేళ మోహన్‌బాబు రూ.41.75లక్షలు చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఈ కేసులో మోహన్‌బాబు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.40.లక్షలు చెల్లించేందుకు సమ్మతి తెలపడంతో న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. అయితే ఈ సొమ్మును చెల్లించేందుకు మోహన్‌బాబు 30 రోజుల గడువు కోరారు. అయితే అనూహ్యంగా కాసేపటి క్రితం ఈ కేసులో తమ తప్పు లేదని దీని మీద పై కోర్టుకు వెళ్తామని మోహన్ బాబు మీడియాకు తెలిపారు.

అయితే ఈ కేసులో మోహన్ బాబుకు శిక్ష పడటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలుగుదేశం అభిమానులు ఆయనను ఒక ఆట ఆడుకుంటున్నారు. గతం కొన్ని రోజులుగా రాజకీయాలలో ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ ఆయన చంద్రబాబుకు క్లాస్ పీకుతున్నారు. ఇప్పుడు మీ నిర్వాకం ఏమిటి అంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు. ఏ2 గా కోర్టుకు ఎక్కడం… జైలు శిక్ష పడటం అంటే మోహన్ బాబు పరిపూర్ణంగా వైకాపా నాయకుడు అయిపోయినట్టే అంటున్నారు వారు.