Mohan Babu hawkerవిలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వర్తమాన రాజకీయాలపై తనదైన శైలిలో చరుకులు విసిరారు. కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

“రాజకీయాల్లో నేనిప్పుడు లేను. రేపు వస్తానో… ఏ పార్టీలోకి వస్తానో తెలియదు. కానీ, బండి ఒక నదిలో వెళ్లాలంటే… నదిలో పడవ బండిని మోస్తుంది. అదే పడవ ఒడ్డుకు చేరిన తరువాత, బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, ఏదో ఒక రోజు రోడ్డు పైకి రాక తప్పదు ఎవరైనా” అని అన్నారు.

మాతృభాషను మరవకుండా ఆంగ్లంలో పట్టును సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యాభాస్యంలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారికి ప్రోత్సాహక బహుమతులను మోహన్ బాబు అందించారు. ఈ డైలాగ్ లు విన్న వారంతా ‘పెదరాయుడు’ సినిమాలో భార్యాభర్తల అనుబంధపు డైలాగ్ లను గుర్తు చేసుకుంటున్నారు. ఈ ‘బండి – పడవ’ సిద్ధాంతంలో కూడా అచ్చు తప్పులుంటే మన్నించండి… అసలు అర్ధమే తప్పనుకుంటే… క్షమించండి..! అని చెప్పకనే చెప్పారు మోహన్ బాబు.