Narendra Modi government increases debt for state governmentsదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో 259 మంది సభ్యులతో ఉన్నత కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2022 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతాయని, ఈ నేపథ్యంలో ‘‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’ పేరిట జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆ కమిటీ ప్లాన్ చేస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకరు ఉన్నారు ఒకరు లేరు అనే చర్చకు ఆస్కారం లేకుండా… మోడీ ప్రభుత్వం సమన్యాయం చేసేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి… ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా కమిటీలోకి తీసుకున్నారు.

2018లో టీడీపీ తో విడాకుల తరువాత చంద్రబాబుని కేంద్రంలోని ఒక కార్యక్రమంలో మోడీ – అమిత్ షా ఇన్వాల్వ్ చెయ్యడం తొలిసారి. వివిధ కార్యక్రమాల రూపకల్పనపై ఈ కమిటీ మార్గదర్శకాలు అందజేస్తుందని కేంద్రం తెలిపింది. కమిటీ ఈనెల 8న తొలిసారి సమావేశం కానుంది.

కమిటీలో కొందరు తెలుగు ప్రముఖులు కూడా సభ్యులుగా ఉన్నారు. దర్శకుడు రాజమౌళి, క్రీడాకారులు పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధు, కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణా ఎల్లా, రామోజీ గ్రూప్‌ అధినేత రామోజీరావు తదితరులు కూడా కమిటిలో చోటు దక్కించుకున్నారు.